05-12-2024 05:56:07 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): టీజీపీఎస్సీ ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం గురువారం బాధ్యతలు స్వీకరించారు. అభ్యర్థులకు కమిషన్ పై పూర్తి విశ్వాసం కలిగేలా పరీక్షల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. 60 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. ప్రతి పరీక్ష ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తామని, తనపై నమ్మకం ఉంచాలని అభ్యర్థులను బుర్రా వెంకటేశం కోరారు.
అభ్యర్థులకు న్యాయం చేసేందుకు 3.5 ఏళ్ల సర్వీస్ వదులుకుని వచ్చి టీజీపీఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. టీజీపీఎస్సీలోని పరిచయాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటే ఎవరు నమ్మొద్దని, ఆ సమాచారాన్ని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరలోనే ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ ను కేటాయిస్తామని చెప్పారు. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో తప్పులు లేకుండా చూస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు.