05-12-2024 06:59:55 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ లో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎంతో పాటు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతనరం ముఖ్యమంత్రి రవాణాశాఖ నూతన లోగోను ఆవిష్కారించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల హామీలో ఉన్న తొలి హామీగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు.
రవాణాశాఖ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని, ఆరు గ్యారంటీలకు బస్సు డ్రైవర్లు, కండక్టర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. నష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ ఇప్పుడు లాభాల్లో నడుస్తోందని, నగరం నిర్మానుష్యంగా మారకుండా ఉండేందుకు స్క్రాప్ పాలసీ తీసుకోస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్, ట్యాక్స్ ఫ్రీ చేశామన్నారు. 2 ఏళ్లలో అందుబాటులోకి 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రవాణా శాఖ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని, కోర్టు కేసుల చిక్కుముడులు విప్పి 55,143 ఉద్యోగాలు ఇచ్చామన్నారు.