05-12-2024 05:32:39 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రముఖ జబర్దస్త్ కమెడీయన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఔటర్ పై జబర్దస్త్ కమెడీయన్ ఆటో రాంప్రసాద్ కారు ప్రమాదం సంభావించింది. షూటింగ్ స్పాట్ కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసకుంది. రాంప్రసాద్ కారు ముందున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. జబర్దస్త్ కమెడియన్ కారును వెనుక నుంచి ఆటో ఢీకొట్టాడంతో రాంప్రసాద్ ముందున్న మరో కారుకు ఢీకొట్టారు. దీంతో తన ముందున్న కారు వెనుక భాగం మొత్తం డ్యామేజ్ అయ్యింది. ఈ ప్రమాదంలో రాంప్రసాద్ కు స్వల్పగాయాలు అయ్యాయి. కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆటో రాంప్రసాద్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.