calender_icon.png 6 November, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిఖనిని సందర్శించిన విద్యార్థులు..

06-11-2025 06:34:16 PM

బెల్లంపల్లి అర్బన్: బెల్లంపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 8వ తరగతి విద్యార్థులు గురువారం శాంతిఖనిని సందర్శించారు. విద్యాపర్యటనలో భాగంగా శాంతిగని మైన్ ను విద్యార్థులు సందర్శించారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదర్, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, సేఫ్టీ ఆఫీసర్ రాజు పర్యవేక్షణoలో విద్యార్థులకు గనులుపై అవగాహన కల్పించారు. బొగ్గు గనుల  ప్రాంతంలో బొగ్గు తవ్వకాల ప్రక్రియ, యంత్రాల వినియోగం, భూగర్భ గనుల నిర్మాణం, కార్మికుల భద్రతా చర్యల గురించి ప్రత్యక్షంగా వివరించారు.

అలాగే గని అధికారులు విద్యార్థులకు బొగ్గు తవ్వక విధానం, విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ చర్యలు, సింగరేణి కాలరీస్ కంపెనీ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. విద్యా పర్యటనలు విద్యార్థుల్లో శాస్త్రీయ అవగాహన, పరిశీలనా దృష్టి, సామాజిక బాధ్యతాభావం పెంపొందడానికి ఎంతో దోహదపడతాయ న్నారు. ఈ పర్యటనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విలువైన జ్ఞానాన్ని పొందారు. ఈ పర్యటనకు సహకరించిన ప్రాజెక్ట్ ఆఫీస్, మేనేజర్, సేఫ్టీ ఆఫీసర్, అధికారులకు పాఠశాల తరుపున డైరెక్టర్ ఈ. రవి ప్రసాద్, ప్రిన్సిపాల్ రాజ రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.