calender_icon.png 24 January, 2026 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణంలో జాగ్రత్త అవసరం

24-01-2026 12:00:00 AM

కలెక్టర్ విజయేందిర బోయి

కోయిలకొండ , జనవరి 23 : ప్రయాణంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించి ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మండల పరిధిలోని జమాల్పూర్ గ్రా మంలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకుఅరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగం, త్రిబుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయన్నారు.

అనంతరం కోయిలకొండ మండలంలో శ్రీ రామ కొండ గుట్ట దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ నీటి శుద్ధి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అకస్మికంగా తనిఖీ చేశారు. మిషన్ భగీరథ ట్యాంక్ ను నిరంతరం శుభ్రంగా ఉంచుకోవాలని మిషన్ భగీరథ డీఈ, ఎఈ లను ఆదేశించారు. వేసవికాలం వస్తున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. డిప్యూటీ ఎంఆర్‌ఓ, ఆర్డబ్ల్యూఎస్ శాఖ డీఈ, ఆర్‌ఐ, జమాల్పూర్ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు ఉన్నారు.