07-11-2025 01:31:23 AM
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 12కు వాయిదాపడింది. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. నిజానికి క్యాబినెట్ సమావేశం శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికలు, ఇతర కారణాలతో దానిని వాయిదా వేశారు. 12న జరిగే భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధా రంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్స్ బిల్లును కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.