calender_icon.png 7 November, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు

07-11-2025 01:32:02 AM

  1. జిల్లాలో 70 శాతం మార్క్ ఔట్ పూర్తి

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

తంగళ్ళపల్లి మండల పరిధిలో మొత్తం 11 ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం

రాజన్న సిరిసిల్ల,నవంబర్ 6(విజయ క్రాంతి):జిల్లాలో తంగనపల్లి మండలం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్ళప ల్లిలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో హౌసింగ్ శాఖ నిర్మించిన మోడల్ హౌస్, మండేపల్లి, చింతలపల్లి, రాళ్లపేటలో మొత్తం 11 ఇందిరమ్మ ఇండ్లు పూర్తి కాగా గృహ ప్రవేశాలు గురువారం నిర్వహించగా, ము ఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవా ల్, కే కే మహేందర్ రెడ్డి హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమ లు చేస్తున్నదని, దీనిలో భాగంగా లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేస్తున్నదని తెలిపారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మిగతా లబ్దిదారులు అందరూ ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని, త్వరితగతిన తమ సొం త ఇంటి కలను పూర్తి చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అధికారులు అందుబాటులో ఉండి నిర్మాణాలు పూర్తి చేసుకునేలా సహకరించాలని ఆదేశించారు. 

అందుబాటులోకి తీసుకురావాలి

తంగళ్ళపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న తహసీల్ కార్యాలయ భవనాన్ని ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే రాళ్ళపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు?

విద్యార్థులకు అందిస్తున్న బోధన, మౌలిక సదుపాయాల తీరుపై ఆమె ఆరా తీశారు.కార్యక్రమంలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింగ్, హౌసింగ్ పీడీ శంకర్, మండల ప్రత్యేక అధికారి, డీపీఓ శర్ఫుద్దిన్, తహసిల్దార్ జయంత్, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.