19-01-2026 01:03:23 AM
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): జనగామ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ అభినందన సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఇటీవల గెలిచిన బీసీ సర్పంచులను సన్మానించి, మాట్లా డారు.
రాష్ర్టంలో కుక్కలకు, పందులకు లెక్క లు ఉన్నాయికానీ బీసీలు ఎంత మంది ఉన్నా రో లెక్కలు లేవు, ఎందుకు బీసీల లెక్కలు బయటకు చెప్పరని ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. తా ను కులగణన గణాంకాలు అడిగితే ఎమ్మె ల్సీ అయినా సమాధానం ఇవ్వడం లేదని, కారణం ప్రభు త్వం మనది కాదని వ్యాఖ్యానించారు. పార్టీల బీ--ఫారాలు మీ దగ్గర ఉండవచ్చు కానీ ఓట్లు మా బీసీల దగ్గరే ఉన్నాయి,ఇది ఎవ్వరూ మర్చిపోవద్దు” అని హెచ్చరించారు.
ఇప్పటికీ కంట్రోల్ బియ్యం తిని జీవనం సాగిస్తున్న బీసీలు రాష్ర్టంలో లక్షల సంఖ్యలో ఉన్నారని, దీనికి పాలకులే బాధ్యులని అన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం రాష్ట్ర నాయ కులు బయటపెట్టే వరకు మనకే తెలియని పరిస్థితి ఉందని ఆవేదనవ్యక్తం చేసిన మల్ల న్న.. బీసీలు చైతన్యం అవుతూ పార్టీ లు మా రడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఇటీవలి కాలంలో ఒక్క రెడ్డి మంత్రి లేకుండా ముగ్గురు బీసీ బిడ్డలు మంత్రులయ్యేలా చేసినది బీసీ చైతన్యమేనని చెప్పా రు. నేను బ్రతికి ఉన్న చివరి నిమిషం వరకు బీసీల కోసం దమ్ము, ధైర్యంతో పోరాటం చేస్తాను” అని స్పష్టం చేసిన ఆయన, రాష్ర్టంలో 13లక్షల 20వేల రెడ్డి జనాభాకు 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 60 శాతం బీసీలకు కేవలం 20 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండటం ఘోర అన్యాయమన్నారు.
బీసీ డిక్లరేషన్ పేరుతో 20వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, కేవలం 2వేల కోట్లు మా త్రమే ఖర్చు చేయడంపై మండలిలో ప్ర శ్నించగా ఎవ రూ స్పందించలేదని విమర్శించారు. గ్రామస్థాయిలో సర్పంచ్‌లకు పూర్తి అధికారాలు ఉన్నాయని, తమ గ్రామాల అభివృద్ధికి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ‘బీసీల కోసమే టీఆర్పీ వచ్చింది. మీరు ఏ పార్టీలో ఉన్నా, సమయం వచ్చినప్పుడు కలుద్దాం, నిలు ద్దాం, గెలుద్దాం. అప్పటివరకు మీకు ఏ కష్టం వచ్చినా బీసీ జేఏసీ, టీఆర్పీ, తీన్మార్ మల్లన్న మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటారు” అని హామీ ఇచ్చారు.
ఈ సభ బీసీల్లో రాజకీయ చైతన్యాన్ని మరింత పెంచిందని, రాబోయే రోజుల్లో బీసీ రాజ్యం దిశగా అడుగులు పడతాయని నాయకులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్‌గౌడ్, ప్రధానకార్యదర్శి వట్టే జానయ్య యాద వ్, ఉపాధ్యక్షుడు ఎల్లబోయిన ఓదెలు యాద వ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్యగౌడ్, జనగామ జిల్లా అధ్యక్షురాలు చెరుకూరి మౌనిక యాదవ్, బీసీ జేఏసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.