30-04-2025 01:04:00 AM
ఏ పార్టీకి రాని పూర్తి మోజార్టీ
ఒట్టావా, ఏప్రిల్ 29: కెనడా ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ప్రస్తుత ప్ర ధాని మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. వరుసగా నాలుగోసారి కెనడా ప్రజానీకం లిబరల్ పార్టీకే జైకొట్టారు. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ లిబరల్ పార్టీకే మరోసారి ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఉన్నట్టు పలువురు పేర్కొంటున్నారు.
కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో మొత్తం 343 స్థానాలుండగా.. కార్నీ నేతృత్వం వహిస్తున్న లిబరల్ పార్టీ 168 స్థానా లు గెలుచుకోనుందని అంతా అంచనా వేస్తున్నా రు. ప్రభుత్వ ఏర్పాటుకు 172 స్థానాల్లో గెలుపొందడం అవసరం.
ఏ పార్టీకి స్పష్టమైన మెజా ర్టీ రాకపోవడంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన లిబరల్ పార్టీకే ప్రభుత్వ ఏర్పాటు అవకాశం దక్కనుంది. ఖలిస్థానీ మద్దతుదారుడు, సిక్కు నేత జగ్మీత్ సింగ్ నేతృత్వం వహిస్తున్న న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) పార్టీ ఎన్నికల్లో ఘో రంగా విఫలం అయింది. దీంతో జగ్మీత్ సింగ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.