calender_icon.png 2 May, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పోకెన్ ఇంగ్లిష్‌లో ఉచిత శిక్షణ

30-04-2025 01:07:12 AM

స్టెప్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో..

గుంటూరు, ఏప్రిల్ 29: స్టెప్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు స్టెప్ కన్వీనర్ ఆత్మకూరి ధర్మారెడ్డి, మానవత చైర్మన్ పావులూరి రమేష్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ప్రత్యూష సుబ్బారావు తెలిపారు. మంగళవారం బ్రాడీపేటలోని జ్యోతి నిలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

మే 1నుంచి 31వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. నేడు విద్య, వైద్య రంగాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో, వ్యాపార రంగాల్లో రాణించడంలో మాతృభాషతో ధీటుగా ఇంగ్లీష్ భాష మీద కూడా పట్టు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా మనల్ని అత్యున్నత స్థానాల్లో నిలబెట్టేందుకు వ్యక్తిత్వ వికాసం దోహదపడుతుందన్నారు.

కావున ఈ రెండింటినీ ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. సెంటర్ ఫర్ సోషల్ సైకాలజీ మనస్తత్వవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణులైన నూతలపాటి అరవింద్, ప్రత్యూష సుబ్బారావు పర్యవేక్షణలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు విద్యార్థులకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు పెద్దలకు, టీచర్లకు ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణ కోరుకునేవారు 81432 34555, 9866012690 నంబర్లను సంప్రదించాలని కోరారు.