06-12-2025 12:16:49 AM
మహబూబ్ నగర్ రూరల్, డిసెంబర్ 5: పిస్తా హౌస్ సమీపం లో ఒక మహిళ మతి స్థిమితం లేకుండా తిరుగుతుందని సమాచారం రావడం తో జరీనా మేడం జిల్లా సంక్షేమ అధికారి ఆధేశాల మెరకు వెంటనే స్పందించి, సఖి సిబ్బంది శిరిష,సరిత వెళ్లి సత్యేశ్వర ఆశ్రమంలో మరలా సఖి సెంటర్ అడ్మిన్, సిబ్బంది షిరీన్, మణెమ్మ అంగన్వాడీటీచర్ ,మాజీ జెడ్పిటీసీ భూత్పూర్ సహకారం తో ఆమెను తన ఇంటి దగ్గరకి వెళ్లి కుటుంబ సభ్యులు అయిన వాల్ల అమ్మ గారికి అప్పగించారు.
ఆమెతో మాట్లాడగా ఆమె 12 రోజుల క్రితం బయటకు వెళ్లింది అని , ఆ తర్వాత ఎంత వెతికిన కనిపించలేదు అని తెలిపారు. జరీనా మేడం కు అలాగే సఖి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. మానసిక స్థితి బాగోలేనందున ఆమెను కుమారి గా గుర్తించారు, సఖి సిబ్బంది జడ్చర్ల లో సత్యేశ్వర ఆశ్రమం కీ పంపించడం జరిగింది అని కుటుంబ సభ్యులకు తెలిపారు.