calender_icon.png 9 December, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనలకు విరుద్ధంగా అభ్యర్థుల ప్రచారాలు

09-12-2025 01:51:45 AM

  1. గ్రామాలలో ఏరులై పారుతున్న మద్యం

డబ్బులు పంచుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్న నాయకులు

గుమ్మడిదల, డిసెంబర్ 8 :గుమ్మడిదల మండలంలో స్థానిక ఎన్నికలు ఈనెల 11వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గు మ్మడిదల మండలం మొత్తంలో 8 గ్రామాలలో ఎన్నికల సందడి జోరుగా కనిపిస్తుంది. జిల్లా ఎన్నికల అధికారి నియమ నిబంధన గురించి వివరించినప్పటికీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పలు గ్రామాలలో మ ద్యం, డబ్బు పంచుతూ ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తున్నారు.

పలు గ్రామాలలో రాత్రివేళ మద్యం ఏరులై పాడుతోంది. తమ అభ్యర్థుల కోసం పార్టీ తరపున మద్దతు తెలపడానికి వచ్చిన నియోజకవర్గ నాయకులు సైతం ఓటర్లను మభ్యపెట్టి వా రికి డబ్బు మద్యం పంచుతూ గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తామంటూ తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కొన్ని ప్రధాన పార్టీ అభ్యర్థుల మద్దతుదారులు ఏకంగా ప్రజలను రో జువారి కూలీలుగా తీసుకుంటూ ఉదయం నుండి సాయంత్రం వారి వెంట తిప్పుకుంటూ వారికి కూలీగా డబ్బులు ఇస్తున్నా రు.

కొన్ని గ్రామాలలో ఎన్నికల అవగాహన సదస్సులో నియమ నిబంధనలు పాటించకపోతే చట్టరీత్యా చర్యలు తప్పవని చెప్పిన ప్పటికీ విచ్చలవిడిగా వాల్ పోస్టర్లను ప్రభు త్వ కార్యాలయాలకు అతికించి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఓటర్లు మాత్రం ఎన్నికల సందడిని ఉపయోగించుకుంటూ ఒకరోజు ఒక అభ్యర్థి వైపున తిరుగు తూ ప్రచారం చేసి మరో రోజు మరో అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారు.

ఎందుకని ప్రశ్నిం చగా ఓటు వేసేటప్పుడు ఎవరికైనా వేయాల్సిందేనని.. ఇప్పుడు మాత్రం రోజువారిగా కూలీ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఎవరు డబ్బులు ఇచ్చినా వారి వైపే ప్రచారం చేస్తూ ఓటు మాత్రం రాబోయే రోజుల్లో మాకు అండగా నిలబడే అభ్యర్థికి వేస్తామంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.