09-12-2025 02:40:09 AM
అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్ యూనివర్సిటీల విద్యార్థులు ఉద్యోగుల ర్యాలీ
బీసీ రిజర్వేషన్ల కై రాజ్యాంగ సవరణ చేయాలి
తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి
సాయి ఈశ్వరా చారి మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ
తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ
ముషీరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశ పెట్టి రాజ్యాంగ సవరణ చేయాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ అన్నారు. వెంటనే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాజేంద్రనగర్ లోని వ్యవసాయ, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీల విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ జేఏసీ ఆధ్వర్యంలో 42శాతం రిజర్వేషన్ల కై ఆత్మబలిదానం చేసుకున్న సాయి ఈశ్వర చారికి సంతాపంగా నల్ల కండువాళ్ళతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో 12,735 గ్రామపంచాయతీలో కేవలం 2176 బీసీ రిజర్వేషన్లు కల్పించారని, ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 46 ను తక్షణమే రద్దు చేయాలన్నారు. 79వ స్వతంత్ర భారతదేశంలో బీసీలు వార్డ్ మెంబర్లు, సర్పంచులు కూడా అవ్వరా, టాక్స్ ప్రేయర్ ఉండాలా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశా రు. 79 ఏళ్లుగా అన్యాయం చేశారని, ఇప్పు డు అవమానిస్తున్నారన్నారు. తక్షణమే పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు.
అందుకు అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి దశరథ్, కృష్ణ, సంతోష్, జనార్ధన్, నాగరాణి, రజినీకాంత్, విద్యార్థి నాయకులు లోకేష్, శివరాం, కవి రాజు, మునీర్ తదితరులు పాల్గొన్నారు.