calender_icon.png 9 December, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగాలు ఏమాయె!

09-12-2025 01:42:28 AM

ప్రభుత్వం హామీ ఇచ్చి రెండున్నరేళ్లాయె! 

ఎన్నికల్లో మొదటేడే.. రెండు లక్షల జాబ్‌లన్న కాంగ్రెస్ 

ఇప్పుడు రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలంటూ మాటమార్చిన ప్రభుత్వం

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ‘మేం అధికారంలోకి వస్తే మొద టి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం’.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ యువతకు ఇచ్చిన హామీ ఇది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్ల తర్వాత ‘కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలన పూర్తయ్యేసరికి లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తాం. యువత ఆకాంక్షలను గుర్తిం చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.

త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి.. ఈనెల 3వ తేదీన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలివి. ఈ వ్యాఖ్యలను విన్న రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. అధికారంలో లేనప్పుడు ఒక మాట.. ఉన్నప్పుడు మరోమాట మాట్లాడటం ప్రభుత్వాలకు తగదని విమర్శిస్తున్నారు. మాటమార్చడంలో గత ప్రభు త్వాన్ని ఈ ప్రభుత్వం మించిపోయిందని మండిపడుతున్నారు.

40 వేల ఉద్యోగాలకు మరో ఆర్నెళ్లు ఆగాల్సిందే..

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన ఉద్యోగాల హామీ అటకెక్కింది. మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని తుం గలోకి తొక్కిందని నిరుద్యోగ యువత పండిపడుతున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు కాస్త.. లక్ష ఉద్యోగాలయ్యాయి. వాటిని భర్తీ చేసేందుకు ఏడాది సమయం కాస్త రెండున్నరేండ్లకు పొడిగించింది. దీన్ని నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు 61,379 మాత్రమే. మరో 8,632 ఉద్యోగ నియామకాలు తుది దశలో ఉన్నాయి. ఇవి ఎప్పుడు పూర్తవుతా యో తెలియదు. ఇక ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే మరో ఆరు నెలలు ఆగాల్సిందే. గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వంలోనూ ఏళ్లకేళ్లు నియామకాలకు నోచుకోక తాము ఎదురు చూడాల్సిందేనా అని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రెండు లక్షల్లో భర్తీ చేసినవి ఇంతే!

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు రాష్ర్టంలో 70,011 ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టింది. ఇందులో ఇప్పటి వరకు 61,379 ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. మరో 8,632 పోస్టుల నియామక ప్రక్రియ తుది దశలో ఉన్నాయి. 2024 ఆగ స్టు 2న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి అనేక నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించారు.

కానీ ఒకటి అర నోటిఫికేషన్లు ఇచ్చి దాన్ని కూడా అటకెక్కించారని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. దాదాపు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వెలువడిన నోటిఫికేషన్లనే కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చాక భర్తీ చేస్తూ వస్తోంది. ఇప్పుడు తామే భర్తీ చేశామన్న ఉద్యోగాల్లో 40 వేల నుంచి 50 వేల ఉద్యోగాలు వారి హయాంలోనివే. గ్రూప్ పోస్టులు 1365కు సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోం ది. ఇక పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 16,067 కానిస్టేబుల్ పోస్టుల ప్రక్రియ పూర్తి చేసింది.

దీంతోపాటు వైద్యారోగ్య శాఖలో 8, 666 పోస్టులు భర్తీ చేయడంతోపాటు, మరో 7,267 పోస్టుల భర్తీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి పూర్తి కావాలంటే ఎంత సమయం పడుతుందో స్పష్టత లేదు. పైగా మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్లకు కోర్టు చిక్కులు వెంటాడుతుండటంతో ఏ నోటిఫికేషన్‌కు ఎన్ని సంవత్సరా లు పడుతుందో చెప్పడం కష్టమే. ఈ క్రమం లో రెండున్నరేండ్లలోనూ కనీసం లక్ష ఉద్యోగాలను భర్తీచేస్తుందో లేదో చూడాలి. మరోవైపు ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు వే యాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.