calender_icon.png 9 December, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరుణను ప్రపంచీకరించాలి

09-12-2025 01:31:36 AM

గాంధీ, నెహ్రూ మార్గంలో రేవంత్

ప్రత్యేక విజన్ దిశగా తెలంగాణ 

నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): గాంధీ, నెహ్రూ మార్గంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన నడుస్తోందని బాలల హక్కుల ఉద్యమకారుడు, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక విజన్ దిశగా ముందుకు వెళ్తుందని, గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని అన్నారు. సోమవారం గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి పాలసీని పేదలు, అత్యంత అణగారిన వర్గాలపై దాని ప్రభావం ఆధారంగా నిర్ణయించాలని తొలి ప్రధాని నెహ్రూకు, గాంధీ చెప్పారని.. ఒకవేళ ఆ పాలసీ ఆ పేద లకు సరైన న్యాయం చేయకుంటే చెత్తబుట్టలో పడేయాలని చెప్పారని గుర్తుచేశారు.

శిఖరాగ్ర సమావేశాల లోగోపై మహాత్మా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించినందుకు నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యువ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణలో అద్భు తాలు చేశారని, విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషిచేస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ కోసం చేసిన సాహసోపేతమైన కల ఈ గ్లోబల్ సమ్మిట్‌తో సా ధ్యమవుతుందని చెప్పారు. 20 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశారని, మ హిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించారన్నారు.

వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ఈ రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోందని, 2047 లోగా 3 ట్రిలియన్ డాల ర్ల ఎకానమీగా తెలంగాణ మారుతుందన్నారు. సంస్కృతి, కళలు టెక్నాలజీ, పరిశ్ర మల హబ్‌గా తెలంగాణ అవతరించబోతున్నదని చెప్పారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూ లన అసాధ్యమని అన్నారని కానీ సమస్యలకు ప్రతి భారతీయుడూ ఒక పరిష్కారం చూపిస్తాడని తాను చెప్పానన్నారు. ఐకమత్యం, శాంతియుత పరిస్థితులతోనే అభివృద్ధి సా ధ్యం అవుతుందని మనం యావత్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూస్తామన్నారు.

భారతీయ విలువకు దోహదపడే వేదిక

విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ శిఖరాగ్ర సమావేశం కేవ లం పెట్టుబడిదారుల వేదిక మాత్రమే కాద ని, ప్రపంచ శాంతి, సామరస్యం, సహనం, వసుధైవ కుటుంబం.. ప్రపంచం ఒకే కు టుంబం అనే భారతీయ విలువకు దోహదపడే వేదిక అని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం ఆర్థికంగానే కాకుండా మెరుగైన ప్రపంచాన్ని రూపొందించడంలో కూడా దోహదపడుతుందని సత్యార్థి నొక్కిచెప్పారు.

నేడు కుంచించుకుపోతున్న మాన వత్వం, పెరుగుతున్న ఉగ్రవాదం, పెరుగుతున్న విభజనలు, శాంతి, గ్రహానికి ముప్పు లను ఎదుర్కొనేందుకు వినూత్న పరిష్కారాలను కనుగొనాలని కోరారు. కరుణగల రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలు, సమాజాన్ని నిర్మించాలని ఆయన నాయకులను కోరారు. అది లేకుండా ప్రపంచ సవాళ్లను పరిష్కరించలేమని నొక్కి చెప్పారు. ఇప్పుడు ‘కరుణను ప్రపంచీకరించాల్సిన’ సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.