08-10-2025 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
మంచిర్యాల, అక్టోబర్ 7 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల లో బీఆర్‌ఎస్ పార్టీ హాజీపూర్ మండల నాయకులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం లో బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లో విఫలం అయ్యిందని, ప్రభుత్వ వైఫల్యం ప్రజల్లోకి తీసుకెళ్లి బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.