calender_icon.png 8 October, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలశక్తి పకడ్బందీగా అమలు చేయాలి

08-10-2025 12:00:00 AM

నిర్మల్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలో అమ లు చేస్తున్న బాలశక్తి కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొదటి దశ లో భాగంగా జిల్లాలోని కేజీబీవీలలో విజయవంతంగా బాలశక్తి కార్యక్రమాన్ని అమలుపరి చామన్నారు. అదేవిధంగా జెడ్పీ పాఠశాలల్లో రెండో దశలో భాగంగా బాలశక్తి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులందరికీ రక్తహీనత, థైరాయిడ్, పోషక లోపాల గుర్తిం పు, తదితర వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని వివరాలు వారి హెల్త్ కార్డుల్లో నమోదు చేస్తూ ఉండాలన్నారు. ఒత్తిడిని అధిగమించుట, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మానసిక ఆరోగ్యం, తదితర అంశాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, సామాజిక అంశాలపై విద్యార్థులకు అన్ని వివరాలు తెలిసే లాగా ప్రభుత్వ కార్యాలయాలకు, వైజ్ఞానిక యాత్రలకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ సమావే శంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈఓ భోజన్న, డిఆర్డివో విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ రాజేందర్, ఎల్డీఎం రామ్ గోపాల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.