14-10-2025 05:12:06 PM
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. ఫ్లాట్ ఫామ్ 10పై అనుమానంగా తిరుగుతున్న వారిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు గుర్తించి తనిఖీ చేశారు. ఒక సంచిలో 1.6 కేజీల గంజాయి చాక్లెట్లు గుర్తించారు. రైల్వేస్టేషన్ లో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులను చూసి నిందితులు పరారీ అయ్యారు. పటుకున్న గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించారు. గంజాయి చాక్లెట్లను ఎవరు ఎవరీకి, ఎక్కడి నుంచి తరలిస్తున్నారనేది ఇప్పటికి స్పష్టత రాలేదు.