14-10-2025 05:34:44 PM
హైదరాబాద్: చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో గ్రూప్ 1 అభ్యర్థులతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. గ్రూప్-1 అభ్యర్థులు, నిరుద్యోగులతో మాట్లాడేందుకు వెళ్లిన కవితను, భారీగా తరలివచ్చిన జాగృతి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లకుండా ఆమెను ఆపడంతో జాగృతి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. తర్వాత లైబ్రరీలోకి కవితను అనుమతించడంతో లోపలికి వెళ్లి సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో కింద బైఠాయించారు. వాగ్వాదం సమయంలో ఇన్ స్పెక్టర్ కు చెందిన వైర్ లెస్ సెట్ మిస్సింగ్ అయ్యింది.