14-10-2025 04:46:42 PM
హైదరాబాద్: కొండాపూర్‌లోని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పీఎల్‌ఆర్ కంపెనీలో సిట్ సోదాలు ముగిశాయి. నలుగురు సిట్ అధికారుల బృందం పీఎల్‌ఆర్ ప్రాజెక్టులో తనిఖీలు చేసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికు చెందిన హైదరాబాద్, బెంగళూరులోని ఇళ్లు, కార్యాలయాల్లోనూ సెట్ అధికారలు మంగళవారం 4 బృందాలతో తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని ఇంట్లో ఉన్న మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆఫీసు సిబ్బందిని కూడా అధికారులు ప్రశ్నించారు. సోమాజిగూడలోని డికాట్ కొరియర్ కంపెనీలోనూ సోదాలు చేసిన సిట్ అధికారులు డికాట్ కొరియర్ నుంచి మిథున్ రెడ్డికి చెందిన పీఎస్ఆర్ ప్రాజెక్టులోకి రూ.25 కోట్లు వచ్చినట్లు గుర్తించారు. ఏపీ లిక్కర్ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డి 71 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.