27-10-2025 01:33:13 AM
మేడ్చల్, అక్టోబర్ 26(విజయక్రాంతి): కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ఫ్లుఓవర్ వద్ద నున్న రైతు బజార్ వద్ద ఓ కారు అతివేగంగా వచ్చిన కారు డివైడర్ను ఢీకొని బోల్తా పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
ఇందు లో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నా రు. వీరు సుడాన్ దేశస్తులుగా పోలీసులు గుర్తించారు. శంషాబాద్‌లోని ఒక కాలేజీలో చదువుకుంటున్నారు. ఘటన సమయంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పగా పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు