calender_icon.png 27 October, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా అక్రమ దందా.. యథేచ్ఛగా తరలింపు

27-10-2025 12:00:00 AM

- పెంచండి అంటూనే మరోవైపు నరికివేత కు సహకారం

- సమాచారం ఇచ్చిన స్పందించని అధికార యంత్రాంగం 

- రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటాం: రాజేందర్ రెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్, జడ్చర్ల,

జడ్చర్ల, అక్టోబర్ 26: జడ్చర్ల నియోజకవర్గం లో అక్రమ కలప దందా యదేచ్చంగా జరుగుతుంది. ఒకవైపు మొక్కలను పెంచం డి అంటూ కోట్ల రూపాయలను వెచ్చిస్తూ ప్రభుత్వం అడుగులు వేస్తున్న ఆశించిన మేరకు లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. మ రోవైపు ఇష్టం సారంగా వృక్షాలను నరికివేస్తున్న నియంత్రించాల్సిన అధికారులు మా త్రం అటువైపు చూడడమే మానేసిన్రు.

చెట్లు నరుకుతున్నారు మహాప్రభు అంటూ సమాచారం అందించిన అనుమతి ఉంది.. లేదు.. కొన్నిటికి ఇచ్చాము..మరికొన్నిటికి ఇవ్వలేదు.. అంటూ కాలయాపన చేస్తూ పరోక్షం గా సంబంధిత అధికార యంత్రం కనుసైగల్లోనే చెట్ల నరికివేత జరుగుతుందని ప్రజలు చెబుతున్న మాట. నియంత్రించాల్సిన అధికారులు నియంత్రణ రేఖ దాటకుండా దూ రంగా ఉండటంతో వృక్షాలు నేల మట్టం అవుతున్నాయి. 

- లక్ష్యం నెరవేరేనా..?

పరిరక్షణలో భాగస్వాములు కండి అం టూ ప్రభుత్వం ప్రకటిస్తుంటే మరో పక్క చెట్ల నరికివేత కొనసాగుతోంది. తెలంగాణ ప్రభు త్వం రాష్ట్ర వ్యాప్తంగా 24.69% ఉన్న అడవులను 33 శాతానికి పెంచడం కోసం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుం ది.కొంతమంది ఫారెస్ట్ అధికారుల అలసత్వం వల్ల జడ్చర్ల మండల కేంద్రంలో కొం తమంది వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా కలప వ్యాపారం చేస్తున్నారు.

మం డలంలోని వివిధ గ్రామాల్లోని రైతుల పంట పొలాల్లో, గట్లపై, బీడు భూముల్లో, ప్రభుత్వ భూముల్లో, గుట్టలపై సహజంగా పెరిగే విలువైన చెట్లను నరికి చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి హోటల్స్, ఫంక్షన్ హాల్స్ కు వి క్రయించి అధిక మొత్తంలో పోగు కుంటున్నారు. అటవీని రక్షించడం తో పాటు వా తావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్ర భుత్వం వాల్టా చట్టం రూపొందించింది. అ మల్లో మాత్రం ఆమడ దూరంలో ఉందని ప ర్యావరణ సంరక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. 

 దర్జాగా నేలమట్టం చేస్తున్న.. ఎందుకు పట్టించుకోరు...

ఈ చట్టం ప్రకారం చెట్లను నరకాలంటే అ టవీశాఖ, రెవెన్యూ శాఖ, సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. కలప వ్యాపారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా, అనుమతులు లే కుండానే చెట్లు నరుకుతూ ఉండటంతో ఫారె స్ట్ అధికారుల తీరుపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు వ్యక్తులు ఫారెస్ట్ అధికారుల నుంచి ఒక డీసీఎం లోడ్ కు అనుమతి తీసుకొని అదే అనుమతి పత్రం తో, కొంతమంది ఫారెస్ట్ అధికారుల అండదండలతో మూడు నుంచి నాలుగు లోడ్ లు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నా యి. అక్రమ కలప రవాణాను అరికట్టాల్సిన ఫారెస్ట్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో కలప వ్యాపారస్తులతో చేతులు కలిపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా అవసరం..

 జడ్చర్ల మండలంలో వృక్షలను ఇం టికెందుకు అనుమతి ఇవ్వలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇచ్చినప్పటికీ పెద్ద మొత్తం లో నరికివేత కు మాత్రం ఎక్కడ అనుమతులు లేవు. ఎక్కడైనా అలాంటి వ్యక్తి జరిగితే పూర్ శైలు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం. రెండు రోజుల తర్వాత పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటాం.

    రాజేందర్ రెడ్డి, ఫారెస్ట్ ఆఫీసర్, జడ్చర్ల,  మహబూబ్ నగర్ జిల్లా