calender_icon.png 24 January, 2026 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

24-09-2024 01:25:44 AM

మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

నల్లగొండ, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): సర్కారు దవాఖానలో మెరుగైన వైద్యం అందించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఏరియా దవాఖానను సోమవారం ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి సమయానికి విధులకు హాజరుకావాలని సూచించారు. గర్భిణులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.