24-01-2026 12:00:00 AM
తప్పిన పెను ప్రమాదం
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఓ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై కారు నిలపడం తో అందులోని ఏడుగురు డోర్లు తీసుకొని బయటకు పరుగులు పెట్టారు. కాగజ్‌నగర్‌కు చెందిన పలువురు మేడారం జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా.. రెబ్బెన పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ కారును ఆపడంతో అందులో ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధం అయింది.