calender_icon.png 24 January, 2026 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెట్‌బాల్ పోటీల్లో కాంస్యం కైవసం

24-01-2026 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 23(విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల , కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సీఈసీ చదువుతున్న విద్యార్థిని బొట్టుపల్లి సాయి దీక్ష పేదరికం తన ప్రతిభకు అడ్డుకాదని నిరూపించింది. సీనియర్ జాతీయ నెట్బాల్ పోటీల్లో (జీడీ గోల్ డిఫెండర్) విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించింది. ఈ నెల 11 నుంచి 14 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 43వ సీనియర్ నేషనల్ నెట్బాల్ అసోసియేషన్ చాంపియన్షిప్లో ఘనత సాధించింది.