calender_icon.png 17 May, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని వీడాలి

17-05-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

అచ్చంపేట మే 16 :వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులు అలసత్వాన్ని వీడాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్  హెచ్చరించారు. శుక్రవారం పటంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును  సందర్శించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యాన్ని రక్షించేందుకు రైతులు టార్పాలిన్ కప్పాలని, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి శుభ్రపరచాలని సూచించారు.

కొనుగో లు కేంద్రాల్లో సిబ్బంది పనితీరుపై అసహ నం వ్యక్తం చేశారు. తూకం వేసిన ధాన్యా న్ని వెంటనే ఆయా మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రక్రియ లో నిర్లక్ష్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సందర్శనలో ఆర్డిఓ మాధ వి, తహసీల్దార్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.