17-05-2025 12:00:00 AM
మునిపల్లి, మే 16 : ఖమ్మంపల్లిలో చెత్త తీయలేరా..? అనే శీర్షిక శుక్రవారం నాడు విజయక్రాంతిలో ప్రచురితమైన కథనానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి స్పందించారు. గత పది రోజులుగా పంచాయతీ ట్రాక్టర్ నడవకపోవడంతో ప్రైమరి స్కూల్ సమీపంలో చెత్త వేయగా వాటిని ట్రాక్టర్లలో తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శివకుమారి మాట్లాడుతూ గ్రామంలో పది రోజులుగా పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చెత్త సేకరణ ఆగిందని, దీంతో పాటు డ్రైవర్ ను తొలగించి కొత్త డ్రైవర్ ను నియమించినట్లు తెలిపారు. కాగా గ్రామంలో పారిశుద్ధ్య పనులు సైతం చేపట్టారు. చెత్త సేకరణ కోసం ప్రతిరోజు ట్రాక్టర్ ను నడిపించడం జరుగుతుందనితెలిపారు.