28-07-2025 11:31:19 PM
నూతనకల్ (విజయక్రాంతి): మండల పరిధిలోని తాళ్ల సింగారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ భవనంలో గల శిలాఫలకాన్ని సోమవారం గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు, ఈ విషయమై సీఐ నరసింహారావు(CI Narasimha Rao), ఎస్సై ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar)లు వివరణ ఇస్తూ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామంలో విచారణ చేపట్టామని, గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ముగ్గురు అనుమానితులు జటంగి శ్రీశైలం, బశిపాక శ్రీకాంత్, బశిపాక జంపన్నలపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. వారి వెంట పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.