28-07-2025 11:33:11 PM
పాపన్నపేట: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు మంజీరా నదిలో గల్లంతైన సంఘటన మండల పరిధిలోని రామతీర్థంలో ఆదివారం సాయంత్రం సమయంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన శహబాజ్(25) ఆదివారం మధ్యాహ్నం సమయంలో స్నేహితులతో కలిసి రామతీర్థం బ్రిడ్జ్ వద్ద మంజీరా నదిలో సరదాగా ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు శహబాస్ నీటిలో మునిగిపోయాడు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదిలో నీటి ప్రవాహం ఉండడంతో చాలా దూరం వరకు కొట్టుకుపోయాడు. ఆదివారమే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు ఆపేసి సోమవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేయగా చాలాసేపటికి మృతదేహం లభ్యమైంది. ఇట్టి సంఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గాలింపు చర్యలను తహసీల్దార్ సతీష్ కుమార్ తో పాటు ఇతర అధికారులు పర్యవేక్షించారు..