calender_icon.png 11 August, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమకారులపై కేసులను ఎత్తేయాలి

10-08-2025 01:39:08 AM

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి 

ముషీరాబాద్,ఆగస్టు 9(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసుల ను వెంటనే ఎత్తేయాలని  తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం  చిక్కడపల్లిలోని  తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లెపు చంద్రన్న ప్రసాద్ నేతృత్వంలో  కార్యవర్గ సమావేశం జరిగిం ది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రతినిధులు, అడహక్ కమిటీ కన్వీనర్లు, కో-కన్వీనర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధుల ఆమోదంతో టీ యూ జేఏసి అన్ని జిల్లాల్లో విస్తరించేందుకు జిల్లా కమిటీలు వేయాలని సమావేశంలో తీర్మానం చేశారు.  ఈ సందర్భంగా తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి మాట్లా డుతూ  తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై పెట్టిన కేసులను వెంటనే  కొట్టివేయాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కరీంనగర్ మాజీ చైర్మన్ వెంకట మల్లయ్య, హైకోర్టు న్యాయవాది కొంగల ప్రజ్ఞత్ కుమార్, జేఏసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు హరి ప్రసాద్ గౌడ్, కొంపల్లి సాయిలు, ఒగిరాల సుజి, అంజలి కుమార్, రాష్ట్ర కార్యదర్శి బి. లావణ్య, బాలలక్ష్మి, స్వరూప రాణి, లలిత మ్మ, సుచరిత, శ్రీనివాస్, రాములు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.