10-08-2025 01:40:45 AM
పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): హిందూ భావజాలాన్ని, సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ భారతీయ పౌరుడిపై ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాఖీ పౌర్ణమి వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సంద ర్భంగా బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ, పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, మహిళ నేతలు, నాయకులు కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని.. దేశం పురోగమిస్తున్న ఈ సందర్భంగా విదేశీ వస్తులవులకు స్వస్తి పలకాలన్నారు.
రక్ష బంధన్ సందర్భంగా స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని ప్రతి కుటుంబానికి విజ్ఞప్తి చేశారు. స్వదేశీ వస్తువులనే వాడాలని ప్రతిఒక్కరు సంకల్పాన్ని తీసుకోవాలని కోరారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ జరుపుకుంటున్న హిందూ బంధువులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
రక్షాబంధన్ సందర్భంగా అక్కాచెల్లెలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివా రి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమళ్ల ఆనంద్‌గౌడ్, వీహెచ్‌పీ నేత పగడాకుల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.