calender_icon.png 15 September, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారం

15-09-2025 12:00:00 AM

- రాజీ పడండి సంతోషంగా జీవించండి 

- జిల్లా ఎస్పీ డి జానకి

 మహబూబ్ నగర్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): రాజీ పడితే కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించేందుకు మంచి అవకాశాలు ఉంటాయని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. జాతీయ మెగా లోక్ అదాలత్ లో 2597 కేసులు పరిష్కార రూపం దాల్చుకున్నాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఎం వీ యాక్ట్ కేసులు 564,పెట్టి కేసులు 1,491,కాంప్రమైజ్ కేసులు193, సైబర్ కేసులు 97 బాధితులకు వారి ఖాతాల్లో 32,19,769 లను రీఫండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారుగత 15 రోజులుగా పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది కేసుల్లో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసినందువల్ల రాజీ మార్గం అవగాహన కలిగిందన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకూ మీ ఇంటికే సత్వర న్యాయం జరిగిందని తెలిపారు.జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ, కేసుల పరిష్కారంలో ప్రతిరోజూ మానిటరింగ్ చేసిన అందరికీ త్వరలో రివార్డు అందజేస్తామని ఎస్పిపేర్కొన్నారు.