calender_icon.png 22 December, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి వనం.. మందుబాబులకు నిలయం!

22-12-2025 12:56:08 AM

రేవల్లి, డిసెంబర్ 21: మండలంలోని పలు గ్రామాల్లో పచ్చదనం పెంచాలని, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’పల్లె ప్రకృతి వనం’ లక్ష్యం దారి తప్పుతోంది. నాగపూర్ గ్రామంలోని ప్రకృతి వనం ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. లక్షలాది రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ వనం ప్రస్తుతం సరైన పర్యవేక్షణ లేక వెలవెలబోతోంది.

గేట్లు తెరిచే ఉండటంతో ఎవరైనా లోపలికి వెళ్లే పరిస్థితి ఉంది. ప్రకృతిని ఆస్వాదించాల్సిన చోట మందుబాబులు తిష్ట వేస్తున్నారు. రెండో చిత్రంలో కనిపిస్తున్నట్లుగా వనంలోని మొక్కల మధ్య ఖాళీ మద్యం సీసాలు విచ్చలవిడిగా పడి ఉన్నాయి. ఇది వనం యొక్క పవిత్రతను, పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. పల్లె ప్రకృతి వనాల నిర్వహణను స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.