14-05-2025 12:38:57 AM
చివ్వేంల,మే13:- తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ బాలికల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సి ఈ సీ,హెచ్ ఈ సి 2025--2026 కు దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు చివ్వేంల తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్ దుర్గ భవాని తెలిపారు.
పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఈ నెల 16 న అవంతి పురం, మిర్యాల గూడెం, తెలంగాణ గిరిజన బాలుర గురుకుల సంక్షేమ జూనియర్ కళాశాల నందు కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని పదవ తరగతి మెమో, టి సి, కుల ఆదాయ ధ్రువీకరణ పత్రములు ఆధార్ కార్డు మరియు మూడు పాస్ ఫోటో లు ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ లు తీసుకొని మే 16 తేదిన ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ దుర్గ భవాని తెలిపారు.