calender_icon.png 25 November, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీఐ నిబంధనలు సడలించాలి

25-11-2025 12:24:31 AM

అలంపూర్, నవంబర్ 24: సిసిఐ నిబంధనలు సడలించి రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  కార్యాలయం ఎదుట సోమవారం రైతులు చేపట్టిన ధర్నా  చేపట్టారు.

ఈ ధర్నా కార్యక్రమంలో గద్వాల జిల్లా పత్తి రైతుల ప్రతినిధిగా జీకే ఈదన్న పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సీసీఐ విధించిన నిబంధనలను సవరించి పత్తి తేమ శాతం 20 ని పెంచాలని బోనస్ క్వింటాకు 475  రూపాయలను ఇచ్చి అలాగే ఎకరాకు ఏడు క్వింటాలు నిబంధనని ఎత్తివేసి అత్యధికంగా గతంలో ఉన్న 14 కింటాలు వరకు  కొనసాగించాలని రైతులు పండించిన మొత్తం పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం స్లాట్ బుకింగ్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని... బుకింగ్ టైం పొడిగించాలని కోరారు. అనంతరం అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు రైతులు పాల్గొన్నారు.