25-11-2025 12:23:49 AM
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న చిత్రం ‘అఖండ2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ విలేకరులతో పంచుకున్నారు.
- ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇవ్వాలనేని అందరం సవాలుగా తీసుకొని ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు 100 శాతం అంచనాలు పెట్టుకుంటే వెయ్యి శాతం ఆ అంచనాలను చేరుతుంది.
- భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో పాత్రను ఢీకొనాలంటే ప్రత్యర్థి పాత్ర కూడా అంతే శక్తిమంతంగా ఉండాలి. అలాంటి ప్రతినాయకుడు ఆది పినిశెట్టి దగ్గర తాంత్రిక శక్తి ఉంటుంది. అఖండ పాత్రలో దైవిక శక్తి ఉంటుంది. అలా ఈ రెండు శక్తుల మధ్య యాక్షన్ సన్నివేశాలను చాలా కొత్తగా కంపోజ్ చేశాం.
- గన్‌కు ఒక త్రిశూలం పవర్, శివుడి శక్తి తోడైతే ఎలా ఉంటుందో ఆ పవర్‌తో యాక్షన్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేశాం. ప్రతి పోరాట ఘట్టం గూజ్‌బంప్స్ తెప్పిస్తుంది. సినిమాలో మూడు వేరియేషన్స్ ఉన్న ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి. మొత్తం మూడు క్యారెక్టరైజేషన్ కూడా మాకు కొత్తగా చేసే అవకాశం ఇచ్చాయి.
- అభిమానులకు రియల్‌గా కనిపించాలని ఇందులో 99 శాతం బాలకృష్ణే చేశారు. మేము మంచులో నాలుగైదు కోట్లు వేసుకుని షూటింగ్‌కు వెళ్లేవాళ్లం. అంతటి మంచులో క్యారెక్టర్‌కు తగ్గట్టు బాలకృష్ణ స్లీవ్‌లెస్‌లో నిలబడి యాక్షన్ చేశారు. షూటింగ్‌లో బాలకృష్ణను ఎదురుగా చూస్తే దైవశక్తిని చూస్తున్నట్టుండేది. పాత్రలో అంతగా లీనమైపోయే నటుడు, పాత్ర కోసం ప్రాణాలు పెట్టే బాలకృష్ణ లాంటి నటుడు మనకు ఉండడం అందరికీ గర్వకారణం.
ప్రతి రంగంలో పోటీ ఉండాలి. మనం ఒక్కరమే ఉంటే అహంకారం వస్తుంది. పక్కోడూ ఉంటే భయం ఉంటుంది. కొత్త స్టుల్స్ రావాలి. ఈ ఫీల్డ్‌లో ప్రతి నిమిషం అప్డేట్ అవుతూ ఉండాలి. మా ఎమోషన్‌లో అప్డేటెడ్ వెర్షన్‌గా మా అబ్బాయి రాహుల్ వస్తున్నాడు. త్వరలోనే అతన్ని యాక్షన్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తాన్నాం. చాలా మంచి సలహాలు ఇస్తుంటాడు. ఈ సినిమాలో బాలకృష్ణ మెడ చుట్టూ త్రిశూలం తిప్పుతూ చేసే యాక్షన్ సీక్వెన్స్ ఆయన చేసిందే!
-ఈ సినిమా కోసం విబూది కొన్ని టన్నులు వాడి ఉంటాం. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు తమ మీద విబూది వర్షం కురిసినందన్న గొప్ప అనుభూతిని కలుగుతుంది. ప్రేక్షకులు శివతత్వాన్ని కడుపు నిండా నింపుకునే సినిమా ఇది.