calender_icon.png 25 November, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామిడి చెట్లకు కల్తీ మందులు వాడొద్దు

25-11-2025 12:22:55 AM

హార్టికల్చర్ అధికారి లక్ష్మణ్

కొల్లాపూర్ రూరల్, నవంబర్ 24: మామిడి చెట్లకు కల్తీ పురుగు మందులు వాడకూడదని హార్టికల్చర్ అధికారి లక్ష్మణ్ రైతులకు సూచించారు. సోమవారం కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామంలో నిర్వహించిన రైతు వేదిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మార్కెట్లో లభించే అనేక కంపెనీల మందులను అధిక మోతాదులో వాడటం వల్ల రైతులు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తోందన్నారు.

సరైన సమయంలో సరైన మోతాదులో మందులు వాడక పోవడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయన్నారు.  ప్రభుత్వం గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వారు సూచించిన మేరకే మందులు వినియోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మామిడి రైతులకు కవర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ జూపల్లి రఘుపతిరావు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.