29-10-2025 12:54:13 AM
17 మంది అరెస్ట్ 29,370 రూపాయల నగదు 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం..
కోరుట్ల అక్టోబర్ 28 (విజయక్రాంతి) కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అష్టలక్ష్మి ఆలయ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న పక్క సమాచారం మేరకు పేకాట స్థావరంపై సిసిఎస్ పోలీసులు దాడి చేసి పదిమందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 22 వేల 50 రూపాయల 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు తదుపరి విచారణ నిమిత్తం కోరుట్ల పోలీస్ స్టేషన్ లో అప్పగించారు అలాగే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వకోట గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న.
పక్క సమాచారంపై పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 7320 రూపాయల నగదు 7 మొబైల్స్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాను తదుపరి విచారణ నిమిత్తం మేడిపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు ఈ సందర్భంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా సుపరెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు అక్రమ అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని పక్కా సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పేకాట ఆడిన నిర్వాహణ స్థావరాలు ఏర్పాటుచేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.