30-10-2025 05:31:14 PM
 
							బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని పాపన్నపేట జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పదవ తరగతి అప్ గ్రేడ్ అయిన సందర్భంగా సంబరాలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి అందుకు కృషిచేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెర్మ మధుకర్ ఉపాధ్యాయులు కంపెల్లి ఊషన్న తాళ్లపల్లి తిరుపతి, తుమ్మిడె కమలాకర్ జాడి రాహుల్ కామెర రాహుల్ జిజియాబాయిలను గ్రామ పెద్దలంతా ఘనంగా శాలువాలతో సన్మానించి మిఠాయిలు తినిపించడం జరిగిందనీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు అందరి కృషివల్నే పదవ తరగతి పాపన్నపేట జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో అనుమతులు తెచ్చుకున్నామని అన్నారు.
విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి విద్య కోసం ఇబ్బందులు పడకుండా సొంత గ్రామంలోనే పదవ తరగతి వరకు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాల పేరు ప్రతిష్టలు తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని అన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు పనులకు పంపకుండా పాఠశాలకే పంపించాలని విద్యార్థుల చదువు కోసం తల్లిదండ్రుల కృషి ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎల్ముల రమేష్,తుమ్మిడె వెంకటేశం, బుజాడి బాబాజీ,దందెర గణపతి, భుజాడి రాకేష్, భుజాడి శ్రీనివాస్, అగాడి బాపూరావు, బెడ్డల నాందేవ్, జాడి తిరుపతి,పొట్టే విలాస్, లాట్కరి రంగయ్య, రౌతు ఉమేష్, మహిళలు అల్లే శాంతి ప్రియ,ఎనుక శ్రీదేవి,కుబిడే రోజా,దందేర భాగ్య, దందెర మమత, తదితరులు పాల్గొన్నారు.