calender_icon.png 20 November, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోల్డెన్ టెంపుల్‌లో ముగిసిన ఉత్సవాలు

20-11-2025 12:00:00 AM

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): నవంబర్ 14న అట్టహాసంగా ప్రారంభమైన హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరు రోజుల పాటు కొనసాగి బుధవారం భక్తి శ్రద్ధలతో అత్యం త వైభవంగా ముగిశాయి. మహా పూర్ణాహుతి, ఉత్సవర అభిషేకం, చక్రస్నానం కార్యక్రమాలతో దేవాలయ పరిసరాలు గోవింద నామస్మరణ మార్మోగాయి. దేవ తా ఉద్యాసనం, పుష్ప యాగం అనంతరం రాధా గోవిందులు, లక్ష్మీ నరసింహ స్వామి, నితాయి గౌరంగ, శ్రీల ప్రభుపాదుల వారికి మహా చూర్ణాభిషేకం ఘనంగా నిర్వహించారు.

రాత్రి మహా సంప్రోక్షణ, మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. ఈ సంవత్సరం, బ్రహ్మోత్సవాల్లో 108-కలశాల మహా చూర్ణాభిషేకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్, అధ్యక్షుడు శ్రీ మాన్ సత్య గౌర చంద్రదాస ప్రభు మాట్లాడుతూ.. స్వామి వారి దివ్య అనుగ్రహంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి అని చెప్పారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.