calender_icon.png 20 November, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీరల పంపిణీని సమాఖ్య సభ్యులు పర్యవేక్షించాలి

20-11-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నవంబరు 19 (విజయ క్రాంతి): ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులందరికీ చీరలు అం దేలా మహిళా సంఘాల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా, మం డల మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న చీరలు ప్రతి ఒక్కరికి చేరేలా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శు లు పర్యవేక్షించాలని అన్నారు. ఓపెన్ స్కూ ల్, వయోజనుల విద్య నమోదులో జిల్లా లక్ష్యాన్ని పూర్తి చేసిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఓపెన్ 10వ తరగతి, ఇంటర్లో నమోదు చేసుకున్నారని తెలిపారు.

వీరంతా తరగతులకు కూడా హాజరు కావాలని సూ చించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వా రా మంజూరైన వివిధ యూనిట్లతో వ్యాపారాలు ప్రారంభించిన మహిళా సంఘాలు కృషి పట్టుదలతో అవకాశాన్ని సద్వినియో గం చేసుకొని లాభాలు గడించాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా అధికారులు, కార్యదర్శులుపాల్గొన్నారు.