calender_icon.png 20 November, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా సేవలు

20-11-2025 12:00:00 AM

పెద్దపల్లి లో ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణా రావు 

పెద్దపల్లి, నవంబర్ 19(విజయక్రాంతి) మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా దేశానికి ఇందిరాగాంధీ ఎనలేని సేవలు అందించారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. బుధవారం పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా ఎమ్మెల్యే ఆమె చిత్రపటానికి పూల మాలలేసి, ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు నిర్మించి, భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందని, ఆమె సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.