23-09-2025 12:08:34 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): బతుకమ్మ వైభవాన్ని ఘనంగా చాటేలా బీజేపీ తెలంగాణ రాష్ర్ట మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం మధ్యా హ్నం 3 గంటలకు చార్మినార్ వద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి తెలిపారు. బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు తో కలిసి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు.
బీజేపీ తెలంగాణ రాష్ర్ట మహిళా మోర్చా అధ్యక్షురాలిగా తన ను రెండోసారి నియమించినందుకు రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమా ర్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, ఇతర పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ హృ దయపూర్వక ధన్యవాదాలు శిల్పారెడ్డి తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో జీఎ స్టీని తగ్గించి, నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్‌ను సోమవారం నుంచి అమలు చేస్తూ, బతుకమ్మ పండుగ, దేవీ నవరాత్రుల సంద ర్భంగా మహిళలకు ప్రత్యేక కానుక అందించారని ఆమె తెలిపారు.
తెలంగాణలో కాంగ్రె స్ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలవేళ ఆంక్ష లు విధిస్తుందని, కోర్టు ఆర్డర్ల ద్వారా మాత్ర మే అనుమతులు తెచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గౌతంరావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఉపాధ్యక్షురాలు బండ కార్తీకరెడ్డి పాల్గొన్నారు.