calender_icon.png 23 September, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్.. స్మగ్లింగ్ కార్లపై నడుస్తుందా?

23-09-2025 12:06:55 AM

  1. స్మగ్లర్ బసరత్ ఖాన్‌తో కేటీఆర్‌కు లింకులు
  2. ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి బండి సంజయ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా?, స్మగ్లింగ్ చేసిన ల్యాండ్ క్రూజర్ వాహనాన్ని ఆ పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాడుతున్నారంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా ఆరోపించారు.  లగ్జరీ కార్ స్కాం నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూ జర్లలో ట్విట్టర్ టిల్లు (కేటీఆర్‌ను ఉద్దేశించి) ఎందుకు తిరుగుతున్నాడు? అంటూ నిలదీశారు.

ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబం ధించిన కంపెనీల పేర్లతో ఎందు కు రిజిస్టర్ అయ్యాయి? అని ప్రశ్నించారు.  వాస్తవాలు బయటకు రావాలని, సంబంధిత శాఖలు విచారణ చేయాలని కోరారు.  ల్యాండ్ క్రూ జర్ వాహనాల స్మగ్లర్ బసరత్ ఖాన్‌తో కేటీఆర్‌కు లింకులున్నాయని ఆరోపించారు.

కేటీ ఆర్ వాడే వాహనం ఎట్ హోం హాస్పిటాలి టీ సర్వీస్ పేరుతో రిజిస్టర్ అయినట్లుగా డీఆర్‌ఐ అధికారులు గుర్తించారని తెలిపారు. ఎ ట్ హోం కు, కేటీఆర్ కుటుంబానికి మధ్య ఉన్న లింక్ పై  అధికారులు ఆరా తీస్తున్నారని బండి సంజయ్ వెల్లడించారు.