27-10-2025 02:19:03 AM
బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుకు ఎంపీ చామల కిరణ్ సవాల్
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి) : కేసీఆర్ హైదరాబాద్‌లో ఎక్కడ లక్ష ఇళ్లు కట్టించారో హరీశ్‌రావు చూపించాలని కాంగ్రె స్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ లక్ష ఇళ్లు కట్టిస్తే సీఎం రేవంత్‌రెడ్డి కూలగొట్టాడని హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణల్లో పసలేదన్నారు. ఆదివారం ఆయ న మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో హైదరాబాద్ ప్రజలు ఎంత ఇబ్బందిపడ్డారో అందరూ చూశారని, హైదరాబాద్‌ను న్యూ యార్క్ చేస్తా, విశ్వనగరం చేస్తానని చెప్పి మునిగిపోయే నగరంగా మార్చారని విమర్శించారు.
హైదరాబాద్ నగరం వరదలో మునిగిపోతుంటే చెరువుల్లో కట్టిన ఇళ్లను హైడ్రా కూల్చివేసింది, నాలాలపైన ఆక్రమణలను తొలగించారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువుల పక్కన ఇళ్లు కడితే కొనడానికి ఎవరూ సిద్ధంగా లేరని తెలిపారు. ఉప ఎన్నికలు వచ్చాయని హరీశ్‌రావు వేదికలపైన పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడని ఎంపీ మండిపడ్డారు.
హుజూరాబాద్‌లో డబ్బులు పంచి గెలిచినట్లు జూబ్లీహిల్స్‌లో కూడా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని, నవీన్‌యాదవ్ నామినేషన్‌తోనే కాంగ్రెస్ విజ యం ఖాయమని తేలిపోవడంతో కేటీఆర్, హరీశ్‌రావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందన్న భయంలో ఉన్నారని, మీ పార్టీ జెండా కట్టే వాళ్లు కూడా ఉండరనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.