17-11-2025 06:37:24 PM
ఉప్పల్ (విజయక్రాంతి): నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమవారం ఉదయాన్నే గంట వ్యవధిలో రెండు చోట్ల స్నాచర్లు చైన్ స్నాచింగ్ కు పాల్పడడం కలకలం రేపింది. దీనితో మహిళలు ఇంట్లో నుండి బయటకు రావడానికి భయాందోళన గురవుతున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నాచారం రాఘవేంద్ర నగర్ లో నివాసముంటున్న స్వప్న కిరాణా దుకాణ నిర్వాహరాలు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రాంతాల్లో ఆలయానికి వెళ్లి పూజలు ముగించుకుని షాప్ కు వెళ్తూ ఉండగా ఒంటరిగా ఉన్న మహిళలను గమనించిన గుర్తుతెలియని ఆగంతకులు బైక్ పై వెనక నుండి వచ్చి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాక్కొని వెళ్లారు.
మంగళసూత్రం లాకెట్ కింద పడిపోగా మూడు తులాల బంగారు చేను తస్కరించారు. బాధితురాలు కేకలు వేసినప్పటికీ అగంతకులు అక్కడి నుండి పారిపోయారు. బాధితురాలు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మల్లాపూర్ లో కూడా చైన్ స్నాచర్లు మరో మహిళ మెడలో బంగారు గొలుసును తస్కరించే క్రమంలో మహిళ కేకలు వేయడంతో పారిపోయారు. నాచారం పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.