calender_icon.png 24 January, 2026 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వయనాడ్ బాధితులపై కేంద్రం నిర్లక్ష్యం

30-10-2024 02:07:42 AM

కాంగ్రెస్ వయనాడ్ అభ్యర్థి ప్రియాంకవాధ్రా

వయనాడ్, అక్టోబర్ 29: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి తీవ్రంగా నష్టపోయిన బా ధితులకు పునరావాసం కల్పించటంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్ల క్ష్యం వహిస్తున్నదని కాంగ్రెస్ నేత, వయనాడ్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాధ్రా ఆరోపించారు. ప్రజలన్నా, ప్రజాస్వామన్నా, దేశమన్నా బీజేపీ ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయిందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా మంగళవారం ఆమె మాట్లాడు తూ.. బీజేపీ విధానాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులా మారా యని మండిపడ్డారు.