calender_icon.png 9 May, 2025 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలి

09-05-2025 01:27:30 AM

  1. ఆర్గానిక్, ఫామింగ్, వ్యవసాయ పనిముట్లపై రైతులు మొగ్గు చూపాలి
  2. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు

మెదక్, మే 8 (విజయక్రాంతి) : కేంద్ర, రాష్ర్ట  ప్రభుత్వ పథకాలు జిల్లాలో ప్రజలకు చేరువ చేయాలని మెదక్ పార్లమెంటు సభ్యు లు మాధవనేని రఘునందన్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అధ్యక్షతన కలెక్టరేట్ లో నిర్వహించడం జరిగింది.

ఈ  సమావేశానికి పట్టభద్రుల ఎమ్మె ల్సీ అంజిరెడ్డి, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ భుజంగరావు, డిఆర్డిఓ పిడి శ్రీనివాసరావు, ఎఫ్బిఎం డైరెక్టర్ సురేష్ బాబుతో  కలిసి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, పౌరసరఫరాల, ప్లానింగ్, సంక్షేమ, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, గ్రామీణ అభివృద్ధి, శాఖల అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యాలు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలపై సుదీర్ఘంగా ఎంపీ సమీక్షించారు.

ముందుగా గత దిశ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలపై అధికారులను ప్రశ్నలు సమాధానాలు రూపంలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో ప్రజలకు అందజేయడంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని  ప్రతి పథకానికి సంబంధించి విస్తృత ప్రచారం కల్పించి ప్రజలలో అవగాహన పెంపొందించి పథకాలు అందేలా చూడాలన్నారు.

విద్యాశాఖ ద్వారా ప్రభుత్వ బాలికల పాఠశాలలో  మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రత్యేక క్లినిక్ చేయడానికి క్లీనింగ్ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా మన జిల్లాకు మంజూరు చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ఎంపీ నిధుల నుండి మండలాల్లో ప్రతి మండలానికి రెండు అంగన్వాడి సెంటర్స్  మంజూరు చేయడం జరిగిందని వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు.

వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సబ్ సెంటర్స్ 20 లక్షల వ్యయంతో నిర్మించి తలపెట్టిన టెండర్ దశలో ఉన్న వాటికి 20 లక్షల వ్యయం సరిపోవటం లేదని అదనపు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు.

నర్సాపూర్ - గుమ్మడిదల 4 లైన్ల రోడ్ 2025 - 26 లో శాంక్షన్ అవుతుందని తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ ద్వారా ఆర్గానిక్ ఫామింగ్, వ్యవసాయ పనిముట్లు పై రైతులు మొగ్గు చూపేలా అవగాహన సదస్సుల ద్వారా విస్తృత ప్రచార కల్పించాలని ఎంపీ ఆదేశించారు. పారదర్శకంగా సన్న బియ్యం సరఫరా, రైస్ మిల్లులో తనిఖీ వివరాలు పిడిఎస్ బియ్యం అమ్ముకున్న విషయంలో  కేసు నమోదు, మిల్లులను సీజ్ చేయడం సంబంధిత విషయాలను సుదీర్ఘంగా చర్చించారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ దిశ  సమావేశంలో చర్చించిన అంశాలపై  అధికారులతో సమావేశాలు నిర్వహించుకుని కేంద్ర అభివృద్ధి పథకాల  కార్యక్రమాల పురోగతిపై చర్యలు తీసుకుంటామన్నారు.  10 వ తరగతి లో మంచి రిజల్ట్ వచ్చిందని,బాల్యవివాహాలను, డ్రాప్ అవుట్లను అరికట్టేందుకు పదవ తరగతి పాస్ అయిన పిల్లలను ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.