09-05-2025 01:27:08 AM
-అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ కుమార్
ముషీరాబాద్, మే 8 (విజయక్రాంతి): యాజమాన్యాలకు అనుకూలంగా మారు స్తూ, కార్మికులకు భద్రత లేని పరిస్థితిగా ఏర్పడిన కార్మిక 4 లేబర్ కోడ్ లనువ్యతిరేకించాలని అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ కుమా ర్ అన్నారు.
బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమర య్య హాల్లో ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ 1, ఐఎన్‌టీయూసీ, బీఆర్‌టీయూల ఆధ్వర్యం లో గురువారం వైద్య ఆరోగ్య ఉద్యోగ సం ఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు వైద్య ఆరోగ్య రంగంలో కూడా జయప్రదం చేయాలని సదస్సులో తీర్మానం చేశారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్రానికి ముం దు తర్వాత కాలంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలలో 29 చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోల్ గా రూపొందించారన్నారు.
ఈ కోడ్‌లో కనీస వేతనాల నిర్ణ యం ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదిలేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు లందరు పాత పెన్షన్ విధానం కోరుకుంటున్నారని నూతన పెన్షన్ విధానంలో అన్యా యం జరిగిందని దానిని మార్చి యూనిట్ పెన్షన్ విధానంగా మార్చారన్నారు.
ఓపీఎస్ పునరుద్ధరించాలని కంట్రీ బ్యూటరీ పెన్షన్ విధానాల వల్ల ఉద్యోగుల తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీ యూ మెడికల్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్, వివిధ సంఘాల నాయకులు యాద నాయక్, బీ భూలక్ష్మి, సత్యనారాయణ రెడ్డి, బాలసుబ్రమణ్యం, ఎండీ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.