09-07-2025 06:00:46 PM
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..
బూర్గంపాడు (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కార్మికులను నష్టపరిచే విధంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బూర్గంపాడు మండల కేంద్రంలో సిఐటియు(CITU), ఏఐటియూసీ(AITUC) కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజన, గ్రామపంచాయతీ కార్మికులకు నష్టం జరిగే విధంగా ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. బూర్గంపాడు మండల కేంద్రంలో భారీ ర్యాలీని నిర్వహించారు.
ఐటిసి పిఎస్పీడీ యూనియన్లు నిరసన..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐటిసిపిఎస్పిడి సారపాకలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. అనంతరం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ రషీద్ కు 20 డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశారు.